News December 12, 2024
చలికాలం అని సరిగా నీరు తాగట్లేదా?
చలికాలంలో సాధారణంగా నీరు పెద్దగా తాగాలనిపించదు. ఇలాగైతే సమస్యలొస్తాయని, కాలం ఏదైనా శరీరానికి నీరు అవసరమని వైద్యులు చెబుతున్నారు. నీటి % తక్కువైతే డీహైడ్రేట్ అయి పొడిచర్మం, అలసట, తలనొప్పి వస్తాయంటున్నారు. ప్రత్యామ్నాయంగా జ్యూస్, వాటర్ కంటెంట్ ఎక్కువుండే పండ్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే, శీతాకాలం చెమట పట్టక శరీరం నుంచి ఉప్పు బయటకు వెళ్లదు. అందుకే ఆహారంలో ఉప్పు తగ్గించాలని చెబుతున్నారు.
Similar News
News December 12, 2024
రాష్ట్రానికి తప్పిన ముప్పు
AP: రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. ‘ఫెంగల్’తో ఇబ్బందులు పడిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళ్లి తీరం దాటుతుందని చెప్పింది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయంది.
News December 12, 2024
నేటి నుంచి రాజమండ్రి- ఢిల్లీ విమాన సర్వీసులు
AP: రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నేడు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 6E 364 ఇండిగో విమాన సర్వీసు నేటి నుంచి రోజూ రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6.30కు ఢిల్లీ నుంచి మధురపూడి వచ్చి, ఇక్కడి నుంచి ఉదయం 9.30కు బయలుదేరి వెళ్తుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజా సర్వీసుతో ఉభయ గోదావరి ప్రజలు సంతోష పడుతున్నారు.
News December 12, 2024
దారుణం.. బాలికను ముక్కలుగా నరికేశాడు!
ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని ధరౌథి పీఎస్ పరిధిలో బాలికను రేప్ చేసిన కను కిస్సాన్ అనే వ్యక్తి గతేడాది AUG జైలుకెళ్లాడు. DECలో బెయిల్పై వచ్చిన అతను బాలికను చంపేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికేసి పలు ప్రాంతాల్లో ఆ భాగాలు విసిరేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. రేప్ కేసులో బాధితురాలైన బాలిక కోర్టులో స్టేట్మెంట్ ఇస్తుందనే భయంతో హత్య చేసినట్లు అతను వివరించారు.