News September 6, 2024
ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ షురూ

AP: విజయవాడ వరద బాధితులకు అధికారులు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ 25 కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు అందిస్తున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో రేషన్ వాహనాలు విజయవాడకు చేరుకున్నాయి.
Similar News
News November 22, 2025
ఎర్రచందనం పరిరక్షణకు నిధుల విడుదల

ఎర్రచందన చెట్ల సంరక్షణపై నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర అటవీ శాఖకు ₹38.36 కోట్లు, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డుకు రూ.1.48 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే ఎర్రచందనం వేలంతో రాష్ట్ర ప్రభుత్వానికి ₹87.68 కోట్లు వచ్చాయి. అదనంగా AP బయోడైవర్సిటీ బోర్డు ద్వారా లక్ష ఎర్రచందనం మొక్కల పెంపకానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు.
News November 22, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News November 22, 2025
పాక్ ప్లాన్‌ను తిప్పికొట్టిన భారత్-అఫ్గాన్

ఇండియా, అఫ్గాన్ మధ్య దౌత్యమే కాకుండా వాణిజ్య సంబంధాలు కూడా బలపడుతున్న విషయం తెలిసిందే. దీనిని తట్టుకోలేని పాకిస్థాన్ వారి రోడ్డు మార్గాన్ని వాడుకోకుండా అఫ్గాన్‌కు ఆంక్షలు విధించింది. పాక్ ఎత్తుగడకు భారత్ చెక్ పెట్టింది. అఫ్గాన్ నుంచి సరుకు రవాణాకు ప్రత్యామ్నాయంగా జల, వాయు మార్గాలను ఎంచుకుంది. ఇరాన్ చాబహార్ పోర్టు నుంచి జల రవాణా, కాబుల్ నుంచి ఢిల్లీ, అమృత్‌సర్‌కు కార్గో రూట్లను ప్రారంభించింది.


