News November 10, 2024
ధోనీకి తలుపులు తెరిచే ఉంటాయి: సీఎస్కే

MS ధోనీకి ఇష్టం ఉన్నన్ని రోజులు తమ జట్టులో ఆడతారని CSK CEO కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఈ విషయంలో ఆయనకు అడ్డుచెప్పబోమని ఆయన స్పష్టం చేశారు. ‘ధోనీకి CSK అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. అంకితభావం, పట్టుదలతో ఆట ఆడతారు. ధోనీ ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారు. అందుకే ఆయన ఆడాలనుకున్నంత కాలం మేం తలుపులు తెరిచే ఉంచుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా CSK ధోనీని రూ.4 కోట్లతో రిటైన్ చేసుకుంది.
Similar News
News January 15, 2026
సంక్రాంతి రోజు ఇలా చేస్తే మంచిది!

పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని పండితుల మాట. ‘కొత్త దుస్తులు ధరించి సూర్యుడిని స్మరించుకోవాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయాలి. ఇష్టదైవానికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఉదయం సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణుడి వ్రతాలు చేస్తే పుణ్యఫలం దక్కి కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా శక్తిమేర దానం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది’ అని చెబుతున్నారు.
News January 15, 2026
114 రాఫెల్స్.. రూ.3.25 లక్షల కోట్ల డీల్!

భారత రక్షణ రంగంలోనే అతిపెద్ద ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.3.25 లక్షల కోట్ల డీల్ను రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఈ వారాంతంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా 30% స్వదేశీ పార్ట్స్తోనే ఇండియాలోనే తయారీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ డీల్ ఫిక్స్ అయితే భారత్లో రాఫెల్స్ సంఖ్య 176కు పెరగనుంది.
News January 15, 2026
పసుపు పంటలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

పసుపు పంట సుడి దగ్గర ఆకులు వాడి, ఎండిపోయి, లాగినప్పుడు మొవ్వు సులభంగా ఊడొచ్చి, దుంప లోపల బియ్యం గింజల్లాంటి పిల్ల పురుగులు కనిపిస్తే అది దుంప తొలుచు ఈగగా గుర్తించాలి. దీని నివారణకు ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. సెంటుకు 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలకు అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలంలో తెగులు ఆశించిన దగ్గర చల్లాలి. అలాగే మొక్కల మధ్య నీరు నిల్వకుండా జాగ్రత్త వహించాలి.


