News May 15, 2024

DOST: ఈనెల 20 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

image

TG: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. విద్యార్థులు ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. గతంలో ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించామని, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల నుంచి వినతులు రావడంతో షెడ్యూల్‌లో సవరణలు చేసినట్లు తెలిపింది.

Similar News

News March 6, 2026

లక్ష మందికి ఉగాది కానుక!

image

AP: ఉగాది పండుగ పురస్కరించుకొని లక్ష మందికి ఈ నెల 18వ తేదీన టిడ్కో ఇళ్లు అందజేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి మిగతా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక TDR బాండ్ల జారీలో గత ప్రభుత్వం వందల రూ.కోట్ల అక్రమాలకు పాల్పడిందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు.

News March 6, 2026

ముందు ఇరాన్.. తర్వాత క్యూబా: ట్రంప్

image

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ వెల్లడించారు. ఇరాన్‌పై పోరుపై దృష్టిపెట్టానని.. అది అయిపోయాక త్వరలోనే క్యూబా సంగతి చూస్తానని వైట్ హౌస్‌లోని ఓ ఈవెంట్‌లో తెలిపారు. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమెరికా క్యూబాపై ఆంక్షలు విధించింది. కాగా ఇటీవల <<19260435>>క్యూబాను<<>> అమెరికా స్నేహపూర్వకంగా దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

News March 6, 2026

ఇరాన్‌పై US దాడులు.. ఏఐతో సెకన్లలో ప్లానింగ్!

image

US మిలిటరీకి AI కొత్త అస్త్రంగా మారింది. ఇరాన్‌పై దాడులు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల్లో 900కుపైగా లక్ష్యాలపై అటాక్ ఏఐతోనే సాధ్యమైంది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ 150కిపైగా సోర్సుల నుంచి రహస్య డేటా సేకరించి సెకన్లలో టార్గెట్స్ సెట్ చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుంది. అయితే పాత డేటాతో తప్పుడు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉంది. స్కూల్‌పై <<19288920>>దాడి<<>> అలాగే అయి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.