News August 7, 2025

DOST: స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి

image

డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. 54,048 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. కామర్స్‌లో 22,328, ఫిజికల్ సైన్స్‌లో 12,211 మంది, లైఫ్ సైన్స్ 10,435, ఆర్ట్స్ కోర్సుల్లో 8,979 మంది సీట్లు పొందారు. వీరంతా ఈనెల 8లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది మొత్తం 1.97 లక్షల మంది డిగ్రీ ఫస్టియర్‌ అడ్మిషన్లు పొందారని తెలిపారు.

Similar News

News August 7, 2025

120 డిగ్రీలు చేసిన విద్యావేత్త కన్నుమూత

image

AP: 120 డిగ్రీలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యావేత్త డా.పట్నాల జాన్ సుధాకర్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖ (D) పెందుర్తి (M) పెదగాడిలో జన్మించిన ఆయన తొలుత CBIలో చిన్న ఉద్యోగం చేశారు. తర్వాత సివిల్స్‌కు ఎంపికయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగాలు చేస్తూనే డిగ్రీలు పూర్తి చేశారు.

News August 7, 2025

సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపు: TCS

image

తమ ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి జీతాలు పెంచబోతున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం మెయిల్స్ పంపుతోంది. 80 శాతం ఉద్యోగులకు హైక్ వస్తుందని.. మిడ్, జూనియర్ లెవల్స్ ఇందులో కవర్ అవుతారని పేర్కొంది. కాగా 12 వేల మంది ఉద్యోగులకు తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజులకే TCS ఈ ప్రకటన చేయడం గమనార్హం.

News August 7, 2025

స్కూళ్లకు వరుస సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఏపీలో ఈ నెల 8న స్కూళ్లకు సెలవు ఉండగా, TGలో ఆప్షనల్ హాలిడే. 9న రెండో శనివారం, ఆగస్టు 10న ఆదివారం సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాతి వారంలోనూ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం(హాఫ్ డే స్కూలు), 16న కృష్ణ జన్మాష్టమి, 17న ఆదివారం కావడంతో వరుస సెలవులు ఉంటాయి.