News May 20, 2024

నేటి నుంచి DOST వెబ్ ఆప్షన్ల నమోదు

image

TG: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) తొలి విడత వెబ్ ఆప్షన్ల నమోదు నేడు ప్రారంభం కానుంది. ఈనెల 30 వరకు ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 3న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కాలేజీల్లో 4,49,449 సీట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు ఈనెల 25తో ముగియనుంది.

Similar News

News November 27, 2025

రబ్బరు పాలను ఎలా సేకరిస్తారు?

image

హెక్టారు రబ్బరు తోట నుంచి ఏడాదికి దాదాపు 2000కి.గ్రా. దిగుబడి వస్తుంది. మొక్క నుంచి వచ్చే పాల కోసం చెట్టుపై బెరడును కొంత తొలగిస్తారు. కాండం నుంచి కారే రబ్బరు పాలను సేకరించడం కోసం డబ్బా లేదా కుండను పెడతారు. ఈ విధానాన్ని టాపింగ్ అంటారు. అయితే మొక్కకు గాటు పెట్టిన దాదాపు 4గంటల పాటు ఈ రబ్బరు పాల రూపంలో కారుతుంది. గడ్డకట్టే రబ్బరు పాలను ఫ్యాక్టరీకి పంపిస్తారు. మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది.

News November 27, 2025

సినిమా అప్డేట్స్

image

* మహేశ్ బాబు అన్న కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కే తొలి చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
* రజినీకాంత్ జైలర్-2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
* రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ధురంధర్’ మూవీ రన్‌టైమ్ 3.32 గంటలని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

News November 27, 2025

BREAKING: హైకోర్టు కీలక ఉత్తర్వులు

image

TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 1032 పోస్టులకు 2015లో నోటిఫికేషన్ వచ్చింది. అనేక న్యాయ వివాదాల అనంతరం 2019లో ఎంపిక జాబితాను TGPSC విడుదల చేసింది. అయితే మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయంటూ ఆ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసింది.