News April 21, 2024
ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా

ఐపీఎల్ 2024లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో ఒకే విజయంతో ఆర్సీబీ చివరి స్థానంలో ఉండగా.. నాలుగు విజయాలతో KKR మూడో స్థానంలో ఉంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు పంజాబ్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. మూడు విజయాలతో GT 8వ స్థానంలో, రెండు విజయాలతో పంజాబ్ 9వ స్థానంలో ఉన్నాయి.
Similar News
News March 17, 2026
తిరుమలలో గ్యాస్ కొరత.. పలు దుకాణాలు మూసివేత!

AP: తిరుమలలో గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పలు టీ షాప్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిర్వాహకులు మూసివేశారు. సిలిండర్ల కోసం గోడౌన్ వద్ద బారులు తీరారు. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది.
News March 17, 2026
ఆధారాలివిగో.. KTR రాజీనామా చెయ్: సీతక్క

TG: మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ₹57000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న KTR <<19406367>>సవాల్‌పై<<>> మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేస్తూ… సవాల్‌కు కట్టుబడి KTR రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు ₹57000 కోట్లు రుణాలివ్వడమే కాకుండా వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇప్పటివరకు ₹1,390 కోట్లు వడ్డీ కింద చెల్లించామని వివరించారు.
News March 17, 2026
సెక్రటేరియట్ టవర్స్: AC, ఎలక్ట్రికల్, పంబ్లింగ్ వర్క్స్‌కు రూ.2316 కోట్లు

AP: అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ టవర్స్‌లో హైసైడ్ ఎలక్ట్రికల్, HVAC, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్, ఫైర్ అలారమ్, పంబ్లింగ్ తదితర పనులకు రూ.2316.88 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం CRDAకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ GO ఇచ్చింది. GAD టవర్‌తో పాటు 1, 2, 3, 4 టవర్లలోని సదరు పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. 53L చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మిస్తున్నారు.


