News February 17, 2025
వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: BRS ప్రభుత్వం నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూం ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1(సొంత స్థలం ఉన్నవారు), L2(స్థలం లేనివారు), L3(ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నవారు)గా విభజించిన విషయం తెలిసిందే. L2లో 19.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Similar News
News December 3, 2025
శ్రీకాంతాచారి చిరస్థాయిగా నిలిచిపోయాడు: కవిత

మలి దశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన ఆత్మబలిదానం రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ జ్వాలను మరింతగా రగిల్చిందని జాగృతి చీఫ్ కవిత అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఎల్బీనగర్లోని విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు శ్రీకాంతాచారి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
News December 3, 2025
హనుమాన్ చాలీసా భావం – 28

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 3, 2025
IPL-2026: వీరిలో ఎవరిని మిస్ అవుతారు?

ఫారిన్ ప్లేయర్లు రసెల్, డుప్లెసిస్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించగా మరో ప్లేయర్ మ్యాక్స్వెల్ వచ్చే సీజన్కు అందుబాటులో ఉండట్లేదని అనౌన్స్ చేశారు. తమదైన ఆటతో మ్యాచు స్వరూపాన్నే మార్చేయడంలో వీరు దిట్ట. స్థిరత్వానికి డుప్లెసిస్ మారుపేరు కాగా, ఆల్రౌండర్ కోటాలో మ్యాక్సీ, రసెల్ రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీరి స్థానాలను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం కష్టమే. మీరు వీరిలో ఎవరి ఆట మిస్ అవుతారు? కామెంట్.


