News December 6, 2024

డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప్ర‌మాద‌క‌రం: కేజ్రీవాల్‌

image

బీజేపీ డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓట‌ర్ల‌ను హెచ్చ‌రించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఆప్ ప‌థ‌కాల‌ను నిలిపివేస్తార‌ని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాలో ఉచిత విద్యుత్ ఎక్క‌డ ఇస్తున్నార‌ని, మంచి స్కూల్స్‌, ఆస్ప‌త్రులు ఎక్క‌డున్నాయ‌ని ప్రశ్నించారు. గెల‌వ‌లేమ‌ని తెలిసే ఢిల్లీలో ఆప్ ఓటర్ల తొల‌గింపున‌కు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

Similar News

News January 23, 2026

వసంత పంచమి పూజా విధానం

image

పూజా మందిరాన్ని శుభ్రపరిచి పీటపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమతో అలంకరించాలి. 9 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం శుభప్రదం. మల్లెలు, జాజి పూలతో అర్చన చేస్తూ సరస్వతి అష్టోత్తర శతనామాలు పఠించాలి. పాలు, పటిక బెల్లం, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. పూజానంతరం ప్రసాదాన్ని పిల్లలకు పంచడం ద్వారా విద్యా బుద్ధులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.

News January 23, 2026

కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

image

పాకిస్థాన్‌ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్‌లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.

News January 23, 2026

MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

image

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.