News March 30, 2025
నేడు IPLలో డబుల్ హెడర్

ఐపీఎల్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో DC-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా తొలి మ్యాచులో RRపై గెలిచిన SRH రెండో మ్యాచులో LSGపై ఓటమిపాలైంది. ఈ మ్యాచులో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇవాళ రాత్రి 7.30 గంటలకు గువాహతిలో RR-CSK మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. బోణీ కొట్టాలని RR, విజయం సాధించాలని CSK యోచిస్తున్నాయి.
Similar News
News September 12, 2025
సాగరంలో సాహస యాత్రకు సిద్ధమైన నారీశక్తి

భారత త్రివిధదళాలకు పదిమంది మహిళాఅధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టే సాహసయాత్రకు సిద్ధమైంది. దీనికి సముద్రప్రదక్షిణ అని పేరు పెట్టారు. ఇందులో భాగంగా ఏకధాటిగా 26,000 నాటికన్ మైళ్లు ప్రయాణించనున్నారు. అత్యంత కఠినమైన దక్షిణ మహాసముద్రం, డ్రేక్ పాసేజ్ జలాల్లో ఈ యాత్ర సాగనుంది. ఈ బృందం వచ్చే ఏడాది మేలో ముంబైకి చేరుతుందని అంచనా. దీనికోసం గత మూడేళ్లుగా ఈ బృందం కఠిన శిక్షణ పొందుతోంది.
News September 12, 2025
సాగులో విత్తనశుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.
News September 12, 2025
ASIA CUP: ఇప్పటికీ ఫైనల్ ఆడని భారత్-పాక్

ఆసియా కప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ ఇంతవరకూ ఫైనల్లో తలపడలేదు. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగ్గా ఈ రెండు జట్లూ ఒకేసారి ఫైనల్ చేరుకోలేదు. గ్రూప్ స్టేజ్, సూపర్-4, సెమీఫైనల్ వరకే తలపడ్డాయి. ఇరు జట్లూ 19 సార్లు పోటీ పడగా 10 మ్యాచుల్లో భారత్, ఆరింటిలో పాక్ గెలిచింది. మరో 3 మ్యాచులు టైగా ముగిశాయి. మరి ఈసారైనా దాయాది జట్లు ఫైనల్లో పోటీ పడతాయా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మీ కామెంట్?