News January 28, 2025
‘డబుల్ ఇస్మార్ట్’కు 10 కోట్ల వ్యూస్

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైనా యూట్యూబ్‌లో అదరగొడుతోంది. మూవీ హిందీ వెర్షన్‌కు నెల రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్, మిలియన్ లైక్స్ వచ్చాయి. పూరీ మార్క్ టేకింగ్, రామ్, సంజయ్ దత్ నటన హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.20 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
కుందేళ్ల షెడ్డు నిర్మాణములో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కుందేళ్ల షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టాలి. షెడ్ పరిసరాల్లో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దాల వల్ల కుందేళ్లు భయపడి వాటి ఉత్పాదక సామర్థ్యం తగ్గే ఛాన్సుంది. షెడ్డు లోపల చల్లని వాతావరణం ఉండాలి. షెడ్డు ఉష్ణోగ్రత ఎండాకాలంలో 30 డిగ్రీల సెల్సియస్ దాటకుండా.. చలికాలంలో 20 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News January 19, 2026
ఎన్కౌంటర్లో ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లాయి. నేషనల్ పార్క్ సమీపంలో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోలు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
News January 19, 2026
ఉన్నావ్ అత్యాచార కేసు.. కుల్దీప్ సెంగార్‌కు చుక్కెదురు

ఉన్నావ్ <<18703366>>అత్యాచార<<>> ఘటనలో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో విధించిన పదేళ్ల జైలు శిక్షను నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది. శిక్షను సవాలు చేస్తూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అతడికి బెయిల్ ఇచ్చేందుకూ ధర్మాసనం అంగీకరించలేదు.


