News August 20, 2024

రెట్టింపైన న్యూజిలాండ్ వీసా ఫీజు!

image

ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోన్న విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారతీయ విద్యార్థులకు వీసా రుసుము పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రూ.19,000 ఉన్న ఫీజును రెండింతలు చేసి రూ.38,190కి పెంచింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. గతేడాది న్యూజిలాండ్‌కు వెళ్లిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరగ్గా భారత్, చైనా నుంచే అధికంగా ఉన్నారు.

Similar News

News November 22, 2025

వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

image

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 22, 2025

బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.

News November 22, 2025

ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

image

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.