News August 2, 2024
స్వప్నిల్ కుసాలేకు డబుల్ ప్రమోషన్

ఒలింపిక్ పతక విజేత స్వప్నిల్ కుసాలేకు రెండు రోజుల్లో డబుల్ ప్రమోషన్ కల్పిస్తామని సెంట్రల్ రైల్వే ASO రంజిత్ మహేశ్వరి తెలిపారు. ఆయన ప్రమోషన్‌ను అడ్డుకున్నామన్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. కాగా స్వప్నిల్ తొమ్మిదేళ్లుగా CRలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎన్ని సార్లు ప్రమోషన్‌కు అప్లై చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఒలింపిక్ మెడల్ సాధించడంతో రైల్వే దిగొచ్చింది.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News January 10, 2026
సగం ధరకే వ్యవసాయ యంత్రాలు.. ఎలా అప్లై చేయాలి?

తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40% నుంచి 50% రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి అమలయ్యే ఈ స్కీమ్ వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హతలు, రాయితీ, అందించే యంత్రాలు, దరఖాస్తు వివరాల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News January 10, 2026
ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఊరట కల్పించింది. పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగాల విషయాల్లో కీలక ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ జీవో 58 ప్రకారం అల్టర్నేట్ ఉద్యోగం కావాలా? పరిహారం కావాలా? అనే విషయాన్ని తెలియజేస్తూ 8 వారాల్లో ఆప్షన్స్ ఇవ్వాలంది. అదనపు పరిహారం కోసమైతే 3 నెలల్లో, ప్రత్యామ్నాయ ఉద్యోగమైతే ఖాళీలను బట్టి 6 నెలల్లో పరిష్కరించాలని రవాణా శాఖను ఆదేశించింది.
News January 10, 2026
ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా భారత బాస్మతి రైస్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. రియాల్ విలువ భారీగా పతనమవడంతో ఆహార దిగుమతులపై సబ్సిడీని టెహ్రాన్ ఎత్తివేసింది. దీంతో రూ.2 వేల కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్ పోర్టుల్లోనే నిలిచిపోయింది. దీనితో పంజాబ్, హరియాణాలకు చెందిన రైస్‌మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోకు రూ.3-4 వరకు ధరలు పడిపోవడంతో రైతులకూ నష్టం వాటిల్లుతోంది.


