News July 23, 2024
AUG 14న ఓవర్సీస్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీమియర్ షోస్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఓవర్సీస్‌లో ఆగస్టు 14న ప్రీమియర్ షోలు ఉంటాయని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా పూరి & చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఇదేరోజు రవితేజ నటిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది.
Similar News
News March 31, 2026
ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా?

ఇళ్లలో ఏసీలు, ఇండక్షన్ స్టవ్‌ల వాడకం పెరగడంతో విద్యుత్ ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ఫ్యాన్లు, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జి సహా ఇతర అప్లయెన్సెస్ వంటి వాటితో కలిపి ఒకేసారి వీటిని వాడటం వల్ల విద్యుత్ లోడ్ ఒక్కసారిగా పెరుగుతుంది. సరైన MCB సేఫ్టీ సిస్టమ్ లేని ఇళ్లలో వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అధిక లోడ్ వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది.

144ఏళ్లుగా నిర్మిస్తూనే ఉన్నారు!

స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో సగ్రాడా ఫెమిలియా చర్చి నిర్మాణం 144 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. 1882లో ఆంటోని గౌదీ అనే ఆర్కిటెక్ట్ ప్రారంభించిన దీని నిర్మాణానికి యుద్ధాలు, సంక్షోభాలు వంటి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. మొత్తానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో దీని ఎక్స్‌టీరియర్ నిర్మాణం పూర్తయింది. 2034కి దీని ఇంటీరియర్స్ పూర్తవుతాయని అంచనా. 172.5 మీటర్ల టవర్స్‌తో ఈ చర్చ్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన చర్చిగా నిలవనుంది.