News August 9, 2024

ఈనెల 11న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్

image

TG: టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఈనెల 11న జరగనుంది. హనుమకొండలోని JNS ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ఉంటుందని మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈనెల 15న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్‌ మూవీ ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా వరంగల్‌లోనే జరగడం విశేషం.

Similar News

News December 21, 2025

పోలీసులే బెట్టింగ్ యాప్‌లకు బానిసైతే.. ఇక కాపాడేదెవరు?

image

బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, వాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ కొందరు <<18630060>>పోలీసులే<<>> ఆ యాప్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరం. సొంతింటినే చక్కదిద్దుకోకపోతే ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకురాగలరు? పోలీసులు ఈ దిశగా ఆలోచన చేయడం అత్యవసరం.

News December 21, 2025

కొత్త ఛార్జీలు ప్రకటించిన రైల్వే

image

రైలు ఛార్జీలను రైల్వే సవరించింది. 215KM కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసులో KMకు ఒక పైసా చొప్పున పెంచింది. మరోవైపు మెయిల్/ఎక్స్‌ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు KMకు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది. ఈ ధరలు ఈనెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ మార్పులతో రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. నాన్ AC కోచ్‌లలో 500 KM జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ.10 అదనంగా ఖర్చు కానుంది.

News December 21, 2025

ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.