News July 31, 2024

ఆగస్టు 4న ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్

image

టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాను చార్మీ నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించగా ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Similar News

News January 14, 2026

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 14, 2026

‘సంక్రాంతి’ అంటే ఏంటో మీకు తెలుసా?

image

సంక్రాంతి అంటే సూర్యుడు ఓ రాశి నుంచి మరొక రాశిలోకి మారడం. ఇది ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర అంటే కదలిక. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుందని, గ్రహాల గమనం వల్లే సృష్టి నడుస్తుందని దీనర్థం. సంస్కృతంలో ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే మార్పు. సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతున్నా, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రాంతి’ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఈ మార్పు అభ్యుదయానికి సంకేతం.

News January 14, 2026

ఉదయాన్నే అలసటగా అనిపిస్తుందా?

image

ఉదయం నిద్రలేవగానే శరీరం బరువుగా, అలసటగా అనిపిస్తే అది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. నిద్ర సరిపోకపోవడం, శరీరంలో నీరు తగ్గడం, విటమిన్-D లోపం, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు కారణమవుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ గోరువెచ్చని నీరు తాగడం, సరైన నిద్ర, ఉదయం ఎండలో కూర్చోవడం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అయినా అలసట తగ్గకపోతే వైద్య సలహా తప్పనిసరి.