News July 11, 2024
EPFO-EPS వేతన పరిమితిని రెట్టింపు చేయండి: BMS

EPFO పరిధిలోని పెన్షన్ పథకంలో వేతన పరిమితి రూ.15వేలు, ESI కార్పొరేషన్‌లో వేతన పరిమితి రూ.21వేలుగా ఉన్న సంగతి తెలిసిందే. నేడు సర్వత్రా పెరిగిన ధరల దృష్ట్యా ఈ పరిమితి సరిపోదని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్(BMS) కేంద్ర ప్రభుత్వానికి తాజాగా గుర్తుచేసింది. పరిమితిని రెట్టింపు చేయాలని కోరుతూ సంస్థ ప్రతినిధుల బృందం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయను కలిసి వినతిపత్రం అందించింది.
Similar News
News April 1, 2026
అమరావతి బిల్లుపై చర్చకు YCP

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.
News April 1, 2026
రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.
News April 1, 2026
SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..

ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.00 గంటల నుంచి 11.45 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.


