News December 7, 2024
EVMలపై డౌట్: ప్రమాణం చేయని MVA MLAs

మహారాష్ట్రలో EVMల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ MVA MLAలు నేటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ‘గెలుపొందిన మా MLAలు నేడు ప్రమాణం చేయరు. మాకు EVMలపై అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూనీ అయింది’ అని శివసేన UBT అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఫలితాలపై సందేహాలొస్తున్నాయి. మొత్తం ప్రక్రియ కళంకితమైంది. ఏదో తప్పు జరిగినట్టు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు’ అని కాంగ్రెస్ MLA విజయ్ తెలిపారు.
Similar News
News November 22, 2025
వైభవంగా రామయ్య నిత్య కళ్యాణ వేడుక

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం సీతారామచంద్ర స్వామికి అత్యంత వైభవోపేతంగా నిత్య కళ్యాణ వేడుకను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అంతరాలయంలో స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారిని నిత్య కళ్యాణం మండపంలో వేయించేసి నిత్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 22, 2025
ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.


