News April 21, 2024
కూటమిలో దెందులూరు, అనపర్తి స్థానాలపై సందిగ్ధం

AP: NDAలో 2 స్థానాలపై సందిగ్ధత కొనసాగుతోంది. దెందులూరు, అనపర్తి స్థానాలపై BJP, TDP మధ్య చిక్కుముడి కొనసాగుతోంది. పొత్తులో BJPకి అనపర్తి సీటు కేటాయించగా.. కమలం గుర్తుపై పోటీ చేయాలని TDP నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు సూచించారు. నల్లమిల్లి అంగీకరిస్తే దెందులూరులో ఇప్పటికే టికెట్ ప్రకటించిన చింతమనేనికి ఇబ్బంది ఉండదు. లేదంటే అనపర్తి TDP తీసుకుని.. BJPకి దెందులూరు కేటాయించే ఛాన్సుంది.
Similar News
News January 30, 2026
NZB: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 13, 14, 15 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రంతో పాటు అర్సపల్లి వాటర్ ట్యాంక్ జోన్ ఆఫీసులో ఉన్న కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా లేదా అని ఆరా తీశారు.
News January 30, 2026
మున్సిపల్ ఎన్నికల బరిలో అమరవీరుడు సంతోష్ బాబు తల్లి

TG: గల్వాన్ లోయ ధీరుడు కల్నల్ సంతోష్ తల్లి మంజుల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. సూర్యాపేటలో BRS తరఫున నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 2020లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు వీరమరణం పొందారు. 2021లో కేంద్రం ఆయనను మహావీర్ చక్రతో గౌరవించింది.
News January 30, 2026
దాడులు ఆపాలని ట్రంప్ రిక్వెస్ట్.. రష్యా అంగీకారం!

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రిక్వెస్ట్ చేశారని రష్యా తెలిపింది. ‘చర్చలు సజావుగా సాగేందుకు ఫిబ్రవరి 1 వరకు అటాక్ చేయొద్దని పుతిన్‌ను వ్యక్తిగతంగా ట్రంప్ కోరారు. అందుకు మేం అంగీకరించాం’ అని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ చెప్పారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌లో తీవ్ర చలి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.


