News September 16, 2024

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడేనని డౌట్

image

డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల కేసులో మెయిన్ సస్పెక్ట్‌ను FBI అరెస్టు చేసింది. అతడి పేరు రియాన్ వెస్లీ రౌత్ (57) అని, గతంలో నిర్మాణ కూలీగా పనిచేసేవాడని, మిలిటరీ బ్యాగ్రౌండేమీ లేదని తెలిసింది. ఆయుధాలు వాడాలని, యుద్ధాల్లో పాల్గొనాలన్న ఉబలాటం ఉందని అతడి సోషల్ మీడియా అకౌంట్లను బట్టి విశ్లేషిస్తున్నారు. 2002లో గ్రీన్స్‌బొరోలోని ఓ భవంతిలోకి ఆటోమేటిక్ గన్ తీసుకెళ్లి బారికేడ్లు వేసుకున్న కేసు అతడిపై ఉంది.

Similar News

News January 1, 2026

ఫుల్ కిక్కు.. 4 రోజుల్లో రూ.1,230కోట్ల మద్యం అమ్మకాలు

image

TG: కొత్త ఏడాదికి ముందు 4 రోజుల్లోనే(28,29,30,31) రూ.1,230 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో మొత్తంగా రూ.5వేల కోట్ల మద్యం సేల్స్ జరిగాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడమూ కారణమని చెబుతున్నారు. ఒక్క నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం రికార్డు కాగా, 2023 డిసెంబర్‌లో రూ.4,291 కోట్ల అమ్మకాలు జరిగాయి.

News January 1, 2026

ఈ దశలో మామిడికి తప్పక నీరు అందించాలి

image

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.

News January 1, 2026

న్యూ ఇయర్ రోజున ఈ పనులు వద్దు: పండితులు

image

కొత్త ఏడాది మొదటి రోజున మనం చేసే పనులు ఆ ఏడాదంతా మనపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో గొడవలు, వాదనలకు దూరంగా ఉండాలని, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటున్నారు. ‘నలుపు దుస్తులు వద్దు. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. ఏడిచినా, విచారంగా ఉన్నా ఏడాదంతా అదే కొనసాగుతుంది’ అంటున్నారు.