News August 2, 2024
మరో ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లపై అనుమానాలు

పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పరిశీలిస్తోంది. వీరిలో ఐదుగురు IASలు, ఒక IRS ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని UPSC ఇప్పటికే రద్దు చేసింది. ఆమె దుబాయ్ పారిపోయినట్లు సమాచారం.
Similar News
News January 28, 2026
ఈ ఉంగరం ధరిస్తే..

జ్యోతిషం ప్రకారం పుష్పరాగం ఎంతో పవిత్రమైనది. ఈ రత్నం గురు గ్రహానికి ప్రతీక. జ్ఞానం, సంపద, సంతోషకర వివాహ జీవితం కోసం దీన్ని ధరిస్తారు. మహిళలకు వివాహ జాప్యం తొలగడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం ఇది బాగా పనిచేస్తుందని నమ్మకం. పగుళ్లు లేని, పారదర్శకమైన బంగారు రంగు పుష్పరాగం ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, దైవానుగ్రహం లభిస్తుందట. జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు.
News January 28, 2026
NIT కాలికట్లో అప్రెంటిస్ పోస్టులు

<
News January 28, 2026
అరటిలో జింకు ధాతు లోపం – నివారణ

అరటిలో జింకు ధాతు లోపం వల్ల లేత ఆకులు, ఈనెల వెంబటి తెల్లని చారలు ప్రారంభమై ఈనెలు పాలిపోయినట్లు లేదా పసుపు రంగుకు మారతాయి. ఈనెల వెనుక ముదురు ఊదా రంగు ఏర్పడుతుంది. ఇది తీవ్రమైతే చెట్టు ఎదుగుదల నిలిచి, గెల, పండు పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములను, జిగురు మందుతో కలిపి తెగులు సోకిన మొక్క ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.


