News June 6, 2024

APలో కూటమి విజయంపై అనుమానాలు: YCP MLA

image

APలో TDP, JSP, BJP కూటమి ఘన విజయంపై ఎన్నో అనుమానాలున్నాయని ప్రకాశం(D) యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై అవిశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు వారు నడుచుకున్నారని విమర్శించారు. అటు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, టికెట్ ఇచ్చిన జగన్‌కు రుణపడి ఉంటానని చంద్రశేఖర్ అన్నారు.

Similar News

News November 28, 2024

‘మహా’ ప్రతిష్టంభనకు తెర?

image

మ‌హారాష్ట్ర తదుపరి CM ఎంపికపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫ‌డణవీస్ పేరును బీజేపీ అధిష్ఠానం దాదాపుగా ఖ‌రారు చేసినట్టు India Today తెలిపింది. సీఎం పీఠం కోసం చివ‌రి వ‌ర‌కూ ప‌ట్టుబ‌ట్టిన ఏక్‌నాథ్ శిండేకు డిప్యూటీ సీఎంతోపాటు కీల‌క శాఖ‌లు ద‌క్క‌నున్న‌ట్టు స‌మాచారం. అజిత్ ప‌వార్‌ ఆశించిన శాఖ‌లకు ఓకే చెప్పిన BJP తన వద్ద 15శాఖ‌ల‌ను అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

News November 28, 2024

త్వరలో మరికొందరు అరెస్ట్: RRR

image

AP: తన కస్టోడియల్ కేసును సీఐడీ పారదర్శకంగా విచారణ చేస్తోందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. తనపై దాడి చేసిన అధికారులు కొందరు అరెస్ట్ అయ్యారని, త్వరలోనే మరికొందరు అరెస్ట్ అవుతారని చెప్పారు. ‘సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ నాపట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ నాపై దాడి చేయించారు. ఆయన విదేశాలకు పారిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News November 28, 2024

పార్ల‌మెంటుకు కాంగ్రెస్ నుంచి మరో గాంధీ

image

నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఏడుగురు పార్ల‌మెంటుకు వెళ్లారు. 1951-52లో అల‌హాబాద్ నుంచి నెహ్రు *1967లో రాయ్‌బ‌రేలీ నుంచి ఇందిరా గాంధీ *1980లో అమేథీ నుంచి సంజ‌య్ గాంధీ *1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ *1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ *2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ *2024లో వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టారు.