News April 15, 2025
‘హరిహర వీరమల్లు’ విడుదలపై అనుమానాలు?

‘హరిహర వీరమల్లు’ను వచ్చే నెల 9న విడుదల చేస్తామని మేకర్లు ఇప్పటికే చెప్పేశారు. అయినప్పటికీ సినిమా విడుదలపై అనుమానాలు కొనసాగుతున్నాయి. Dy.CM బాధ్యతల్లో బిజీగా ఉన్న పవన్, ఈ వారంలో తన పార్ట్ షూటింగ్ పూర్తిచేయాలని భావించారు. ఊహించని రీతిలో ఆయన కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంతో అది కాస్తా వాయిదా పడింది. పవన్ సీన్స్ మూవీకి కీలకం కావడంతో మే 9కి విడుదల చేయగలమా లేదా అన్న టెన్షన్లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 8, 2026
వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్‌లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
News January 8, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 8, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.