News September 9, 2024

మాస్క్‌డ్ ఆధార్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

image

*https://uidai.gov.in/en/లోకి వెళ్లి My Aadhaar సెలక్ట్ చేసుకోవాలి.
*ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి.
*చెక్ బాక్స్‌లో డౌన్‌లోడ్ మాస్క్‌డ్ ఆధార్‌పై టిక్ చేయాలి.
*సబ్మిట్ ఆప్షన్ నొక్కగానే మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
>>ఇందులో ఆధార్‌లోని మొదటి 8 అంకెలు కనిపించకపోవడం వల్ల మోసపోయే అవకాశాలు తక్కువ.

Similar News

News November 20, 2025

405Kmph.. రికార్డులు బద్దలు కొట్టిన మెలిస్సా

image

కరీబియన్‌ దీవులను ధ్వంసం చేసిన <<18174610>>మెలిస్సా<<>> హరికేన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 252mph(405Kmph) వేగంతో విరుచుకుపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అత్యంత శక్తిమంతమైన హరికేన్ వేగమని NSF NCAR వెల్లడించింది. జమైకా వైపు దూసుకెళ్తున్న సమయంలో ఈ రికార్డు నమోదైంది. 2010లో తైవాన్ సమీపంలో టైఫూన్ మెగీ నమోదు చేసిన 248mph రికార్డును మెలిస్సా అధిగమించింది. దీని ప్రభావంతో 70 మందికిపైగా మృతి చెందారు.

News November 20, 2025

సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌.. ఇవాళే లాస్ట్ డేట్

image

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్‌ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్‌సైట్‌ <>https://www.cbse.gov.in<<>>

News November 20, 2025

ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>ఇస్రో<<>> -ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్- B పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/