News January 1, 2026

DPR లేని ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు చెల్లించారు: రేవంత్

image

TG: పార్టీని బతికించుకునేందుకు KCR మళ్లీ చంద్రబాబు పేరును, నీటి సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని CM రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడారు. పాలమూరు-RR ప్రాజెక్టుకు KCR ఏడేళ్లు DPR సమర్పించలేదన్నారు. దీంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేని ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కొందరు కేసులు వేశారన్నారు. DPR లేని ప్రాజెక్టుకు కమీషన్ల కోసం KCR రూ.27వేల Cr చెల్లించారని విమర్శించారు.

Similar News

News January 8, 2026

మొక్కజొన్న కంకిలో చివరి వరకూ గింజలు రావాలంటే?

image

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.

News January 8, 2026

ఇవాళ మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం

image

AP: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో గత నెల 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు. ఇంతటితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కానున్నాయి. మొత్తం 10 రోజుల్లో మొదటి 3 రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజుల్లో సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు అవకాశం కల్పించారు. రేపటి నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

News January 8, 2026

ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

image

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.