News January 7, 2025
మార్చి నెలాఖరు కల్లా DPRలు రెడీ చేయాలి: రేవంత్
TG: జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు సహా పలు అంశాలపై వారితో చర్చిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా కొత్త కారిడార్ల DPRలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో కారిడార్లకు ఏప్రిల్ నాటికి టెండర్లు పిలిచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
Similar News
News January 8, 2025
మోదీజీ అమరావతికి రండి: సీఎం చంద్రబాబు
AP: మోదీని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో నిత్యం ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని సీఎం ఆహ్వానించారు. ఏ సమస్య చెప్పినా మోదీ వెంటనే అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారని కొనియాడారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, ఇందుకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
News January 8, 2025
ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
AP: దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే సర్కారు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఎన్డీయే బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ వృద్ధి ఉండాలి. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే రెండంకెల అభివృద్ధి, పేదరిక నిర్మూలన సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నా. పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తాం. ఇక నుంచి అన్నీ జయాలే. అపజయాలుండవు’ అని ధీమా వ్యక్తం చేశారు.
News January 8, 2025
దక్షిణ కోస్తా రైల్వే జోన్: సాకారమైన కల
AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్కు ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వేకు అత్యధికంగా ఆదాయం అందించే దక్షిణ కోస్తా ఏర్పాటు లైన్ క్లియర్ అయింది. కొత్త రైళ్లు, మార్గాలు, ప్రాజెక్టులు మరింత సుగమం కానున్నాయి. ఆర్ఆర్బీ, రైల్వే ఆస్పత్రి, శిక్షణ, వర్క్షాపులు ఏర్పాటుతో ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.