News December 27, 2024
ఒక్క నెలలో 15% ఎగిసిన Dr.Reddy’s

Dr.Reddy’s షేర్లు ఈ నెలలో 15% మేర ఎగిశాయి. గత 51 నెలల్లో మంత్లీ పెరుగుదలలో ఇదే అత్యధికం. 2020 Sepలో 22%, అలాగే 2023 జూన్‌లో 14.5% ఎగిశాయి. రేటింగ్ ఏజెన్సీ నోమురా Dr Reddysకు Neutral నుంచి Buy ఇవ్వడంతో గత 7 సెషన్లలో Price 11% పెరగడం గమనార్హం. 2026లో ఇతర సంస్థలతో పోటీ, నిర్వహణ ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉండడం సంస్థ పనితీరుకు పెద్ద సవాలు అని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News November 7, 2025
రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.
News November 7, 2025
BJP, BRS కుమ్మక్కు: మంత్రి పొన్నం

TG: జూబ్లీహిల్స్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25వేల ఓట్లు సాధించిన బీజేపీకి.. 2024 ఎంపీ ఎన్నికల్లో అక్కడే 64 వేల ఓట్లు ఎలా వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ‘2023లో BRSకు 80 వేల ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్లే ఎందుకు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి BRS మద్దతు ఇస్తే శాసనసభ ఎన్నికల్లో BRSకు BJP మద్దతు ఇచ్చింది’ అని ఆరోపించారు.
News November 7, 2025
వీధి కుక్కలు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి: సుప్రీంకోర్టు

వీధికుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ‘స్కూల్స్, రైల్వే స్టేషన్స్, ఆస్పత్రుల్లోకి వీధికుక్కలు రాకుండా 8 వారాల్లో ఫెన్సింగ్ వేయాలి. NH, ఎక్స్‌ప్రెస్ హైవేలపైకి మూగజీవాలు రాకుండా చూడాలి. పబ్లిక్ ఏరియాల్లో స్ట్రే డాగ్స్ తిరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించింది. అమికస్ క్యూరీ దీనిపై నివేదిక అందించాలంది. అమలుపై అఫిడవిట్లు వేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.


