News October 15, 2024

నాటకీయం ‘మహా’ రాజకీయం (2/2)

image

ఉద్ధ‌వ్ ప్ర‌భుత్వం Nov 28, 2019న ఏర్ప‌డింది. కాంగ్రెస్, NCPలు అధికారంలో భాగ‌స్వామ్యం అయ్యాయి. అయితే, జూన్ 29, 2022న‌, అంటే ఉద్ధ‌వ్ CM ప‌ద‌వి చేప‌ట్టిన 31 నెల‌ల‌కు BJP రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు శివ‌సేన, NCP చీలిపోయాయి. 40 మంది MLAల‌తో ఏక్‌నాథ్ శిండే వ‌ర్గం శివసేన పార్టీని క్లైం చేసుకొని BJP వెంట న‌డిచింది. దీంతో MVA కూట‌మి ప్ర‌భుత్వం కూలిపోయింది. BJP అండ‌తో ఏక‌నాథ్ శిండే CM ప‌ద‌వి దక్కించుకున్నారు.

Similar News

News October 26, 2025

NLG: పాపం పత్తి రైతు.. ఇలాగైతే కష్టమే!

image

వరుస వర్షాలతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. అకాల వర్షాల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం 12 శాతం లోపు తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర వచ్చే నిబంధనలు ఉండడం రైతుకు ఇబ్బందిగా మారింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం తగ్గడం లేదని రైతుల వాపోతున్నారు.

News October 26, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

ఏపీలోని ఎయిమ్స్ మంగళగిరి 10 వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం 10రోజుల్లోగా దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను స్పీడ్ పోస్ట్ చేయాలి. కన్సల్టెంట్, సీనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్, బయో మెడికల్ ఇంజినీర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: aiimsmangalagiri.edu.in

News October 26, 2025

గ్యాస్ గీజర్లు వాడుతున్నారా?

image

కర్ణాటకలోని బెట్టపురలో బాత్‌రూమ్‌లో గీజర్ నుంచి లీకైన LPG గ్యాస్ పీల్చడంతో అక్కాచెల్లెళ్లు గుల్ఫామ్, తాజ్ చనిపోయారు. అలాంటి గీజర్లు వాడే వారికి ఈ ఘటన ఒక వేకప్ కాల్ అని నిపుణులు అంటున్నారు. మీరు గ్యాస్ గీజర్లు వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ‘యూనిట్‌ను బాత్‌రూమ్‌లో కాకుండా బయటి ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేయించాలి. తరచూ గ్యాస్ లీకేజీలను చెక్ చేయాలి. వాడనప్పుడు ఆఫ్ చేయాలి’ అని సూచిస్తున్నారు.