News September 1, 2025
ద్రవిడ్ అప్‌సెట్ అయ్యారేమో: ABD

RR కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిసిందని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఆయన్ను అప్‌సెట్ చేసి ఉంటుందని SA మాజీ క్రికెటర్ ABD అన్నారు. ‘ద్రవిడ్‌ను కోచ్‌గా తొలగించి వేరే రోల్ ఆఫర్ చేశారు. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. బహుశా కోచ్‌గా ఉండాలని అనుకున్నారేమో. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. బట్లర్ వంటి అద్భుతమైన ప్లేయర్లను వదులుకుని RR తప్పు చేసింది’ అని ABD అభిప్రాయపడ్డారు.
Similar News
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
రంగులు మారే గణపతి ఆలయం.. ఎక్కడంటే?

TN కేరళపురంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి వినాయక విగ్రహం ఉత్తరాయణంలో నలుపు, దక్షిణాయనంలో తెలుపు రంగులో దర్శనమిస్తుంది. ఇక్కడి బావి నీరు కూడా విగ్రహానికి వ్యతిరేక రంగులోకి మారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కూడా కాలానుగుణంగా ఆకు రాల్చడం, చిగురించడం వంటి వింతలు ప్రదర్శిస్తుంది. 12వ శతాబ్దపు ఈ పురాతన గుడి మిరాకిల్ వినాయకర్‌గా భక్తులను ఆకర్షిస్తోంది.
News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.


