News February 22, 2025
కుమారుడితో కలిసి క్రికెట్ ఆడిన ద్రవిడ్

టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కొడుకు అన్వయ్ ద్రవిడ్‌తో కలిసి ఓ క్లబ్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచులో ద్రవిడ్ 8 బంతులాడి 10 పరుగులకే ఔటయ్యారు. కానీ అన్వయ్ మాత్రం హాఫ్ సెంచరీ(58)తో మెరిశారు. కాగా రాహుల్ ఇద్దరు కుమారులు సమిత్, అన్వయ్ క్రికెట్లో రాణిస్తున్నారు. సమిత్ కేపీఎల్‌లో కూడా ఆడారు. ప్రస్తుతం కర్ణాటక తరఫున రంజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News February 23, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: చికెన్ అంటే భయమా? వీటిని ట్రై చేయండి!

బర్డ్ ఫ్లూ భయంతో కొందరు చికెన్‌కు దూరంగా ఉంటున్నారు. చికెన్‌కు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల గింజలు తింటే ఎక్కువ బలాన్ని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం తింటే కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శనగలు తింటే పోషకాలు అందుతాయి. వాల్ నట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రాజ్మా, జనపనార గింజలు తింటే ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
News February 23, 2025
చరిత్రలో ఈరోజు(ఫిబ్రవరి 23, ఆదివారం)

* వరల్డ్ మెజీషియన్స్(ఇంద్రజాలికులు) డే
* 1483- మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం
* 1503- తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య మరణం(ఫొటోలో)
* 1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
* 1957- మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జననం
* 2009- రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏఆర్ రెహ్మాన్
News February 23, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.