News August 13, 2024
రోహిత్ శర్మ కెప్టెన్సీపై ద్రవిడ్ ప్రశంసలు

రోహిత్ శర్మ నాయకత్వంపై భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించారు. ఆటగాళ్లు అతడి లీడర్‌షిప్ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ‘జట్టు రాణించడం అనేది కచ్చితంగా కెప్టెన్‌పైనే ఆధారపడి ఉంటుంది. రోహిత్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఈ రెండున్నరేళ్లలో తానెంత అద్భుతమైన నాయకుడో గమనించాను. కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు కూడా నాకు బాగా సహకరించారు’ అని తెలిపారు.
Similar News
News April 13, 2026
పాత ఇంట్లో దొరికిన నాణెం.. వేలంలో ₹1.2కోట్లు

బ్రిటన్ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా పేరుగాంచిన ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ వేలంలో £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికింది. వేల్స్‌లోని ఒక పాత ఇంట్లో దొరికిన ఈ ఐదు పౌండ్ల నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉండటంతో కాయిన్ కలెక్టర్స్ దీనిని నాణేల ప్రపంచంలో ‘హోలీ గ్రెయిల్’(అత్యంత అరుదైనది)గా భావిస్తారు.
News April 13, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News April 13, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు


