News May 12, 2024

రోహిత్, హార్దిక్ మధ్య ద్రవిడ్ సఖ్యత తీసుకురావాలి: హర్షా భోగ్లే

image

IPL-2024లో MI ఓడిన తీరు స్టోరీ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తుందని కామెంటేటర్ హర్షా భోగ్లే అన్నారు. ‘చాలా మంది ముంబై ప్లే ఆఫ్స్‌కి వెళ్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీనిని మనం టీమ్‌ఇండియా కోణంలో చూస్తే కోచ్ ద్రవిడ్ వెంటనే చేయాల్సిన పని ఒకటి ఉంది. జట్టులో కీలక ప్లేయర్లయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య సఖ్యత తీసుకురావాలి. ముఖ్యంగా వారిని త్వరగా ఫామ్ అందుకునేలా చేయాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 1, 2025

ఉగాదే మన కొత్త సంవత్సరం: రాజాసింగ్

image

TG: తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదేనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం పేరిట విదేశీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు నేటి తరం అలవాటు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆంగ్లేయులు జనవరి 1ని మనపై రుద్ది వెళ్లారు. ఆ వలస సంస్కృతిని వదిలేద్దాం. ప్రభుత్వాలు, మేధావులు ఉగాదిని కొత్త సంవత్సరంగా అలవాటు చేయాలి. క్లబ్బులు, పబ్బులు భారత సంస్కృతి కాదు’ అని పేర్కొన్నారు.

News January 1, 2025

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం

image

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, సుమీ ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. 21 మిస్సైల్స్‌ను మాస్కో ప్రయోగించగా ఆరింటిని తాము నేలకూల్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. దాడిలో ప్రాణనష్టం సంభవించలేదని, ఒకరు గాయపడ్డారని వెల్లడించింది. ఆస్తినష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఇక మరో 40 డ్రోన్లతోనూ మాస్కో దాడి చేసిందని, వాటిలో 16 డ్రోన్లను నేలకూల్చామని, 24 డ్రోన్లు తమ వరకూ రాలేకపోయాయని పేర్కొంది.

News January 1, 2025

2025 సాఫీగా సాగేందుకు ఈ మూడూ కీలకం

image

కొత్త ఏడాది వచ్చేసింది. గడచిన కాలం ఎన్నోకొన్ని పాఠాలను మనకు నేర్పింది. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగితే కొత్త ఏడాది సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా సారీ, థాంక్స్, ప్లీజ్ అనే మూడు పదాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వ్యక్తిత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అడిగే సమయంలో ఒక ప్లీజ్, తప్పు జరిగినప్పుడు ఒక సారీ, సాయం పొందినప్పుడు ఒక థాంక్స్.. ఈ మూడూ మనిషి గౌరవాన్ని పెంచుతాయని వారు చెబుతున్నారు.