News February 27, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
Similar News
News February 27, 2026
సీఎంలుగా చేసి ఇతర పార్టీల్లోకి జంప్!

ఒక పార్టీ నుంచి రాష్ట్రానికి CMగా వ్యవహరించినా రాజకీయ సమీకరణాలు, అవకాశాల కోసం పలువురు పార్టీ మారడానికి వెనకాడటం లేదు. తాజాగా TN మాజీ సీఎం <<19250954>>పన్నీర్ సెల్వం<<>> DMKలో చేరారు. INC నుంచి CMలుగా చేసిన అశోక్ చవాన్(మహారాష్ట్ర), కిరణ్‌కుమార్‌రెడ్డి(AP), అమరీందర్(పంజాబ్) BJPలో చేరారు. చంపై సోరెన్(ఝార్ఖండ్) JMM నుంచి BJPలోకి వెళ్లారు. జగదీశ్ షెట్టర్(కర్ణాటక) BJP నుంచి INCలోకి వెళ్లి మళ్లీ సొంతగూటికి చేరారు.
News February 27, 2026
చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటికొచ్చా: కవిత

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ లభించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే మోపారని తాను తెలంగాణ ప్రజలకు మొదటి నుంచీ చెప్తూ వస్తున్నట్లు తెలిపారు. ‘కడిగిన ముత్యంలా వస్తానని ముందే చెప్పాను. అదే జరిగింది. కష్టసమయంలో అండగా నిలబడ్డ జాగృతి కార్యకర్తలు, భర్త, అత్తామామలు, కొడుకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.
News February 27, 2026
ప్రధాని మోదీని కలిసిన విజయ్-రష్మిక

నూతన దంపతులు విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో మార్చి 4న జరిగే రిసెప్షన్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆయనకు ప్రత్యేక శాలువాను అందజేశారు. ఈ సందర్భంగా వీరికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కాసేపు కూర్చొని ముచ్చటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా విరోష్ జంట కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించింది. ఈ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి.


