News December 8, 2025

DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)లో 38 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరుతేదీ. టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/

Similar News

News April 13, 2026

ఇంటర్ ఫలితాలు.. 8 మంది విద్యార్థుల ఆత్మహత్య

image

TG: ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎగ్జామ్స్‌లో విఫలమవడమంటే జీవితంలోనే ఓడిపోవడం కాదనే విషయాన్ని మరిచి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మార్కులే భవిష్యత్తు కాదనే విషయాన్ని పిల్లలకు పేరెంట్స్, టీచర్స్ అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలి.

News April 13, 2026

పిచ్చి పీక్స్.. చందమామపై ‘ట్రంప్ టవర్’

image

చంద్రునిపై తన పేరుతో టవర్ ఉన్నట్లు చూపే AI ఫొటోను US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ SM అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. గోల్డ్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న ఈ భవనం చంద్రమండలంపై అమెరికా ఆధిపత్యాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. అంతరిక్ష రంగంలో US ఎప్పటికీ టాప్‌లో ఉంటుందని తెలిపేలా ట్రంప్ ఈ విధంగా పోస్ట్ చేశారు.

News April 13, 2026

రాకా: సైన్స్ ఫిక్షన్+ మైథాలజీ?

image

అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ లుక్ మూవీపై హైప్‌ను పెంచింది. ఈ చిత్రంపై ఓ క్రేజీ బజ్ వైరలవుతోంది. ఇందులో సైన్స్ ఫిక్షన్‌తోపాటు మైథాలజీని కూడా టచ్ చేసినట్లు సమాచారం. తోడేళ్లకు సంబంధించి పురాణాల్లో ఉన్న ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా దీపికా పదుకొణె, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.