News August 24, 2025

DRDO IADWS ప్రయోగం విజయవంతం

image

DRDO ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్(IADWS) ప్రయోగం విజయవంతం కావడంపై సంస్థ, సాయుధ బలగాలను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అభినందించారు. ఇందులో బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి(QRSAM), వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(VSHORADS) మిసైల్స్, లేజర్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. దీంతో వాయు రక్షణ పెరగడంతో పాటు శత్రు వైమానిక ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది.

Similar News

News August 24, 2025

98% మంది డాక్యుమెంట్లు సమర్పించారు: ECI

image

బిహార్‌‌లో ఓటర్ లిస్ట్‌కు సంబంధించి 98.2% మంది ఓటర్లు డాక్యుమెంట్లు సమర్పించారని భారత ఎన్నికల సంఘం(ECI) వెల్లడించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అనంతరం రూపొందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌పై అభ్యంతరాలతో పాటు సర్వే సమయంలో ఇవ్వని డాక్యుమెంట్లను సమర్పించేందుకు EC అవకాశమిచ్చింది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి ఇప్పటివరకు 98.2% మంది డాక్యుమెంట్లు సమర్పించారని, మరో 8 రోజుల గడువు ఉందని తెలిపింది.

News August 24, 2025

హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం!

image

TG: హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం/రాత్రి వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో జల్లులు పడే ఛాన్స్ ఉందని, గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడా సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

News August 24, 2025

యూరియా, ఎరువులు పక్కదారి పట్టొద్దు: CBN

image

AP: ఎరువుల ధరలు పెంచి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిలెన్స్ ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. యూరియా, ఎరువులు పక్కదారి పట్టకుండా స్టాక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.