News September 10, 2024

డ్రీమ్ క్రికెట్‌ను వదిలి ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధించి!

image

పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే, బాల్యం నుంచే క్రికెటర్ కావాలని నదీమ్‌కు కోరిక ఉండేదని ఆయన సోదరుడు షాహీద్ తెలిపారు. నదీమ్‌‌కు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. నదీమ్‌ను క్రికెటర్ చేసేందుకు అయ్యే ఖర్చును తండ్రి భరించలేకపోవడంతో జావెలిన్ వైపు వచ్చేశారు.

Similar News

News November 15, 2025

APPLY NOW: RRUలో 9 పోస్టులు

image

గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<>(RRU<<>>) 9 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ (గ్రాఫిక్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, మల్టీ మీడియా ఆర్ట్స్), LLM, BSc(నర్సింగ్), NET/SLET/SET, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rru.ac.in

News November 15, 2025

మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

image

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.

News November 15, 2025

మిరప పంటకు వేరు పురుగుతో తీవ్ర నష్టం

image

వేరు పురుగులు మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. బాగా పెరిగిన వేరు పురుగు ‘సి(C)’ ఆకారంలో ఉండి మొక్క వేర్లపై దాడి చేసి నాశనం చేస్తాయి. పిల్ల పురుగులు మొక్కల వేర్లను కత్తిరించడం వల్ల మొక్క పాలిపోతుంది. కొన్ని రోజుల వ్యవధిలో పూర్తిగా ఎండిపోతుంది. దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి రైతులు ఆర్థికంగా నష్టపోతారు.