News August 23, 2025
కొత్త బిజినెస్‌లోకి DREAM SPORTS!

ఆన్‌లైన్ గేమింగ్ చట్టంతో డ్రీమ్11 తమ ఆర్థిక లావాదేవీలను ఆపేసింది. ఈ నేపథ్యంలో దీని పేరెంట్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్.. ‘డ్రీమ్ మనీ’ పేరిట కొత్త యాప్‌ను టెస్ట్ చేస్తున్నట్లు మనీ కంట్రోల్ తెలిపింది. ఇందులో రోజుకు రూ.10 నుంచే డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ Augmontతో చేతులు కలిపింది. అలాగే బ్యాంక్ ఖాతా లేకుండానే కనీసం రూ.1000తో FD చేసే అవకాశం కల్పించనుంది.
Similar News
News August 23, 2025
యూరియా కొరతపై BRS,BJP డ్రామాలు: రేవంత్

TG: యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి PAC సమావేశంలో స్పందించారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని KTR అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశాను. యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలి’ అని తెలిపారు.
News August 23, 2025
రేపటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో ఆది, సోమవారాల్లో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ 2 రోజుల సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.
News August 23, 2025
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్, భట్టి, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు, ఈ నెల 29న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని PAC భేటీలో నిర్ణయించారు.