News December 7, 2024

వీకెండ్స్ మాత్రమే తాగినా ప్రమాదమే!

image

వారంలో ఒక‌ రోజు మద్యం సేవించినా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లివర్ డాక్టర్‌గా పేరొందిన సిరియాక్ ఫిలిప్ వారంలో ఒక రోజు మ‌ద్యం సేవించే 32 ఏళ్ల యువ‌కుడి లివ‌ర్ దెబ్బతిన్న తీరును ప్ర‌త్యేక్షంగా చూపించారు. ఆ యువ‌కుడి భార్య ఇచ్చిన ఆరోగ్య‌వంత‌మైన లివ‌ర్‌తో దాన్ని పోలుస్తూ పంచుకున్న ఫొటో వైర‌ల్ అవుతోంది. ఏ మోతాదులో తీసుకున్నా మద్యపానం హానికరమని చెబుతున్నారు. Share It.

Similar News

News September 18, 2025

జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

image

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.

News September 18, 2025

తప్పిన మరో పెను విమాన ప్రమాదం

image

విశాఖ నుంచి HYD ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. విశాఖలో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ఇంజిన్‌ ఫ్యాన్ రెక్కల్లో పక్షి చిక్కుకుంది. దీంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన పైలట్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103మంది ప్రయాణికులున్నారు. కొన్నినెలల కింద అహ్మదాబాద్‌ ఫ్లైట్ క్రాష్‌లో 270మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

News September 18, 2025

అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు: సీఎం చంద్రబాబు

image

AP: కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి. సంస్కరణలు అంటే నేనెప్పుడూ ముందుంటా. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.