News November 7, 2024
పచ్చి పాలు తాగుతున్నారా?

పాలు తాగడం మంచి అలవాటే. కానీ, పచ్చి పాలను కాచకుండా తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరానికి కలిగే దుష్ర్పభావాలు ఇవే. ఫుడ్ పాయిజనింగ్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడం, యువకుల్లో ప్రాణాపాయం కలిగించే ఇన్ఫెక్షన్ రావడం, మహిళల్లో గర్భస్రావ పరిస్థితులు ఏర్పడటం వంటి ప్రమాదాలు జరగవచ్చు.
Similar News
News January 14, 2026
ఇంటర్ ఫస్టియర్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్!

ఇంటర్ పూర్తయ్యాక నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ను ఫస్టియర్/11వ తరగతిలోనే జరిపే ప్రతిపాదనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు చేస్తోంది. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తగ్గించడం, కోచింగ్ సెంటర్ల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఈ దిశగా ఆలోచిస్తోంది. అలాగే ఇంటర్ పరీక్షలను మల్టిపుల్ ఛాయిస్ తరహా విధానంలో నిర్వహించడం, బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇవ్వడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
News January 14, 2026
రేపు, ఎల్లుండి విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, విదర్భ, కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. నిన్నటి క్వార్టర్ఫైనల్లో పంజాబ్ 183 పరుగుల తేడాతో MPపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. దీంతో రేపు జరిగే సెమీఫైనల్లో విదర్భ-కర్ణాటక తలపడనుండగా, ఎల్లుండి పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమ్లు 18న ఫైనల్లో తలపడనున్నాయి.
News January 14, 2026
నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


