News September 3, 2024

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా?

image

ఉదయం నిద్ర నుంచి లేచాక ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే శరీర జీవక్రియ రేటు సాధారణం కంటే 30% పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలు ఆరోగ్యంగా మారతాయని, అలాగే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 4 లీటర్ల నీరు తాగాలని సూచిస్తున్నారు.

Similar News

News December 4, 2025

HYDలో యముడిని తీసుకొచ్చారు!

image

HYDను ‘సేఫరాబాద్’గా మార్చేందుకు ఓ ఫౌండేషన్ వినూత్న రోడ్ సేఫ్టీ క్యాంపైన్ ప్రారంభించింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు యమధర్మరాజును రంగంలోకి దించింది.
రసూల్‌పురా జంక్షన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని 365 కూడళ్లలో ఏడాది పాటు కొనసాగించనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే పెద్దఎత్తున మరణాలు తగ్గుతాయన్నారు.

News December 4, 2025

సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్‌లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.

News December 3, 2025

IND vs SA.. రెండో వన్డేలో నమోదైన రికార్డులు

image

☛ వన్డేల్లో ఇది మూడో అత్యధిక ఛేజింగ్ స్కోర్ (359)
☛ వన్డేల్లో కోహ్లీ వరుసగా 2 మ్యాచుల్లో సెంచరీ చేయడం ఇది 11వ సారి
☛ SAపై అత్యధిక సెంచరీలు (7) చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
☛ 77 బంతుల్లో రుతురాజ్ సెంచరీ.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఇండియా బ్యాటర్‌కు ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. Y పఠాన్ (68బాల్స్) తొలి స్థానంలో ఉన్నారు.
☛ సచిన్ 34 వేర్వేరు వేదికల్లో ODI సెంచరీలు చేశారు. దానిని కోహ్లీ సమం చేశారు.