News October 7, 2024

రన్నింగ్‌ బస్సు‌లో డ్రైవర్‌కు గుండెపోటు

image

TG: గుండెపోటుకు గురైనా ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణను మరువలేదు. 45 మంది ప్రాణాలను కాపాడి, ఆయన తనువు చాలించారు. హుజూరాబాద్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ వెళ్తుండగా గజ్వేల్ వద్దకు రాగానే డ్రైవర్ రమేశ్‌ సింగ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన బస్సును సురక్షితంగా పక్కకు నిలిపి, కుప్పకూలిపోయారు. ప్రయాణికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు.

Similar News

News March 22, 2026

IPL చరిత్రలోనే తొలిసారి

image

SRH తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్‌ను నియమించడంతో ఈ ఏడాది IPL ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 18 సీజన్లలో తొలిసారి ఆరంభ మ్యాచ్‌లకు అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే నాయకత్వం వహించనున్నారు. రజత్(RCB), శ్రేయస్(PBKS), పరాగ్(RR), హార్దిక్(MI), రుతురాజ్(CSK), అక్షర్(DC), గిల్(GT), రహానే(KKR), పంత్(LSG) టీమ్స్‌ను లీడ్ చేయనున్నారు. 2019 సీజన్ మధ్యలో ఒకట్రెండు మ్యాచ్‌లకు ఇలా జరిగింది.

News March 22, 2026

యుద్ధం.. కాసేపట్లో ప్రధాని మోదీ కీలక భేటీ

image

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కాసేపట్లో సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. పెట్రోలియం, పవర్, ఫెర్టిలైజర్ మంత్రులు పాల్గొననున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నిరంతరాయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల సరఫరా, సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడటమే మీటింగ్ ఉద్దేశమని తెలిపాయి. అలాగే ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడిన అంశాలపైనా మోదీ చర్చించే అవకాశం ఉంది.

News March 22, 2026

ఈ నెల 25న కాంగ్రెస్‌కు గుడ్‌బై: జీవన్ రెడ్డి

image

TG: ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. కాగా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ గంటన్నర సేపు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.