News October 30, 2024

మెట్రో రెండో దశలో డ్రైవర్ రహిత కోచ్‌లు

image

TG: HYD రెండో దశ మెట్రో ప్రాజెక్టులో అత్యాధునిక విధానాలు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవర్ రహిత ఫోర్త్ జనరేషన్ కోచ్‌లను ప్రతిపాదించింది. ప్లాట్‌ఫామ్‌లపై స్క్రీన్ డోర్లు, స్టేషన్ల వద్ద ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్, ప్రతి కారిడార్‌కు ఒక డిపో ఉండేలా నిర్దేశించింది. రెండో దశలో 5 కారిడార్లలో ₹24,269Cr వ్యయంతో 76.4KM మేర <<14462321>>మెట్రో<<>> మార్గానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News February 17, 2026

అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగులగొడతారు?

image

హిందూ ధర్మంలో మట్టి కుండను మానవ శరీరానికి, దానిలోని నీటిని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. ప్రదక్షిణ సమయంలో చిల్లుల నుంచి కారే నీరు, శరీరం-ఆత్మ మధ్య బంధం క్రమంగా వీడిపోవడాన్ని సూచిస్తుంది. చివరగా కుండను పగలగొట్టడం అంటే.. ప్రాపంచిక బంధాలన్నీ తెంచుకుని, పంచభూతాలతో నిర్మితమైన శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోయిందని, ఆత్మ మోక్ష మార్గంలో స్వేచ్ఛగా పయనించాలని అర్థం. ఇది ఆత్మ అంతిమ విముక్తికి ప్రతీక.

News February 17, 2026

BEL 72 పోస్టులకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) నవీ ముంబైలో 72 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech(ECE, M.E), BSc, BCom, BA, డిప్లొమా(ECE, ME, ITI) అర్హతగలవారు NATS/NAPS పోర్టల్‌లో FEB 27 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లకు ఫిబ్రవరి 28న, ఐటీఐ అప్రెంటిస్‌లకు మార్చి 2న ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వెబ్‌సైట్: https://bel-india.in

News February 17, 2026

పెసరపిండితో ఎన్నో ప్రయోజనాలు

image

* పెసరపప్పును నానబెట్టి పాలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత శుభ్రం చేస్తే ముఖం తేమగా, మృదువుగా మారుతుంది. * పెసరపప్పు పేస్ట్‌కి రోజ్ వాటర్, ముల్తానీ మట్టి కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత నెమ్మదిగా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. * పొడి పెసర పిండికి కాస్త పెరుగు యాడ్ చేసి ముఖం, మెడ, చేతులకు రాసి రుద్దుకుంటే ట్యాన్ మొత్తం పోతుంది.