News April 18, 2024

డ్రైవర్ అన్నలూ.. నిర్లక్ష్యంతో ప్రాణాలు తీయకండి

image

రోడ్డుపై నిలిపి ఉంచిన లారీలు, భారీ వాహనాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. జాతీయ రహదారులపై బ్రేక్ డౌన్ అవడం, విశ్రాంతి కోసం కొంతమంది లారీ డ్రైవర్లు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే కార్లు వెనుక నుంచి ఢీకొడుతున్నాయి. నిన్న వడోదరలో ఈ తరహా ప్రమాదంలో 10 మంది మరణించారు. రోడ్డుపై లారీలు ఆపకూడదు. ఒకవేళ ఆపాల్సి వస్తే ఇండికేటర్స్ ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News December 10, 2025

నాగార్జున సాగర్@70ఏళ్లు

image

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.

News December 10, 2025

బుమ్రా 100వ వికెట్‌పై SMలో చర్చ!

image

SAపై తొలి T20లో బ్రెవిస్ వికెట్ తీసిన బుమ్రా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వికెట్‌పై SMలో చర్చ నడుస్తోంది. బుమ్రా నో బాల్ వేశారని, థర్డ్ అంపైర్ కూడా సరైన నిర్ణయం ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్‌లో నిర్ణయం బౌలర్‌కు అనుకూలంగా ఉంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అది గుడ్ బాలా? నో బాలా? COMMENT.

News December 10, 2025

డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

image

1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
– అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం