News January 7, 2025
విశాఖలో డ్రోన్లపై నిషేధం
AP: నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్లపై నిషేధం విధించారు. రేపు PM మోదీ పర్యటన ఉండటంతో ఆయన పర్యటించే రూట్లలో 5 కి.మీ పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ప్రైవేట్ డ్రోన్ల వినియోగదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం విశాఖలో పర్యటించనున్న మోదీ రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత ప్రధాని నగరంలో రోడ్ షో నిర్వహించి సభాస్థలి వద్దకు చేరుకుంటారు.
Similar News
News January 8, 2025
ఫార్ములా-ఈ కేసు: విచారణకు హాజరైన నిందితులు
TG: ఫార్ములా-ఈ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లతో హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
News January 8, 2025
Stock Markets: O&G షేర్లు అదుర్స్.. మిగతావి బెదుర్స్
బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఒపెక్ కంట్రీస్ క్రూడాయిల్ సరఫరాను తగ్గించడం, బలహీనమైన US జాబ్డేటా నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 23,644 (-62), సెన్సెక్స్ 77,986 (-218) వద్ద ట్రేడవుతున్నాయి. Oil & Gas మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. RIL, DRREDDY, ONGC, AXISBANK, BPCL టాప్ గెయినర్స్. TRENT టాప్ లూజర్.
News January 8, 2025
టాటా సుమో మళ్లీ వస్తోంది!
1990, 2000ల్లో విపరీతమైన ఆదరణ పొందిన టాటా సుమో మళ్లీ వచ్చే అవకాశముంది. ఈ సంవత్సరం టాటా మోటార్స్ ఈ వాహనాన్ని రీలాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచి ఆధునాతన ఫీచర్లతో ఈ SUVని రూపొందించనున్నట్లు సమాచారం. ధర రూ.10-15 లక్షలుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది. కాగా టాటా సుమో తొలి మోడల్ 1994లో వచ్చింది.