News April 3, 2024
కరవు వచ్చింది.. ఊరు తేలింది

TG: వేసవి ఆరంభంలోనే రాష్ట్రాన్ని కరవు ఛాయలు కమ్ముకున్నాయి. మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇప్పుడు కుడి, ఎడమ కాలువలతో పాటు లోయర్ మానేర్ డ్యామ్కు నీటిని విడుదల చేస్తుండటంతో మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గింది. ఇన్నాళ్లు నీటిలో మునిగి ఉన్న ముంపు గ్రామాల్లోని ఇళ్లు, స్కూళ్లు, ఆలయాలు బయటపడుతున్నాయి.
Similar News
News November 17, 2025
అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు(1/2)

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.
News November 17, 2025
iBOMMA రవి భార్య వల్ల దొరికిపోయాడా? క్లారిటీ ఇదే!

iBOMMA నిర్వాహకుడు రవి భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులయ్యాయి. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్లోని విస్టా అపార్ట్మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.
News November 17, 2025
శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్సైట్: https://svuniversityrec.samarth.edu.in


