News October 10, 2024
తూర్పుగోదావరిలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్

AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్హౌస్లో జరిగిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 24, 2026
అరుణోదయ స్నానం ఎలా చేయాలంటే?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తూర్పు ముఖంగా నదిలో నిలబడి తలపై ఒకటి, భుజాలు, మోచేతులు, మోకాళ్లపై 2 చొప్పున మొత్తం 7 జిల్లేడు ఆకులను, వాటిపై రేగుపళ్లను ఉంచి స్నానం చేయాలి. అలాగే సూర్య మంత్రాలు పఠించాలి. నెత్తిన రేగుపళ్లు పోసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, గత జన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం.
News January 24, 2026
రానున్న 24 గంటల్లో వర్షాలు

AP: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లూరి (D) జి.మాడుగులలో 6.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News January 24, 2026
కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.


