News October 16, 2024

పెరగనున్న మందుల ధరలు

image

టీబీ, ఆస్తమా, గ్లాకోమా, తలసేమియా, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన మెడిసిన్ ధరలను 50 శాతం పెంచేందుకు ఎన్‌పీపీఏ ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే ఫార్మాస్యూటికల్ కంపెనీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. బెంజిపెన్సిలిన్‌, ఆట్రోపైన్‌, స్ట్రెప్టోమైసిన్‌, సాల్బుటమాల్‌, పిలోకార్పైన్‌, సెఫడ్రాక్సిల్‌, డెస్ఫెర్రొగ్జామైన్‌, లిథియం మందులు ఈ జాబితాలో ఉన్నాయి.

Similar News

News January 3, 2026

చిత్తూరు: పరీక్ష కేంద్రాలు ఇవే

image

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డిఆర్ఓ మోహన్ కుమార్ శనివారం తెలిపారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.1. ఆర్‌వీఎస్ నగర్లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, 2. పలమనేరు మదర్ తెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, 3. చిత్తూరు మురకంబట్టులోని శ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 4. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News January 3, 2026

KCR అస్త్రాన్నే ఆయుధంగా మలుచుకుంటున్న రేవంత్!

image

TG: పాలమూరు ప్రాజెక్టు అస్త్రంగా GOVT, INCపై పోరాటం చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని BRS చీఫ్ KCR భావించారు. అందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో 3 సభలకూ నిర్ణయించారు. అయితే ఆ ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక అవినీతి జరిగిందని ఆరోపించిన CM దానిపై SIT ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. దీంతో KCR వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఆయన ప్రయోగించిన అస్త్రాన్నే రేవంత్ ఆయుధంగా మలుచుకున్నట్లవుతోంది.

News January 3, 2026

బినామీ ఆస్తుల గుర్తింపునకు AI టూల్: అతుల్ సింగ్

image

AP: అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. 2025లో ACB 115 కేసులు నమోదు చేసింది. ఇందులోని 69 ట్రాప్ కేసుల్లో 19 రెవెన్యూ విభాగానివే. కాగా ఆదాయానికి మించిన కేసులు 8 ఉన్నాయి. విద్యుత్తు, వైద్య, మున్సిపల్, PR శాఖల ఉద్యోగులపై ఈ కేసులున్నాయి. ఉన్నత, మధ్యస్థాయి అధికారులు బినామీల పేరిట ఆస్తుల్ని కూడబెడుతున్నారు. వాటిని గుర్తించడానికి AI టూల్‌ను ప్రవేశపెడుతున్నామని ACB DG అతుల్ సింగ్ తెలిపారు.