News March 24, 2024

డ్రగ్స్ ప్రమాద ఘంటికలు

image

విశాఖలో భారీ డ్రగ్ కంటైనర్ దొరకడం రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురి చేసింది. రాజకీయ పార్టీలు ఆరోపణలు గుప్పించుకోవడంలో బిజీగా ఉన్నాయి. అసలు ఈ దందా ఎప్పటి నుంచో కొనసాగుతోందా? అలా అయితే డ్రగ్స్ ఎక్కడికి చేరుతున్నాయి? అనేది ఇక్కడ ప్రధాన అంశం. కొన్ని ముఠాలు స్కూళ్లు, కాలేజీలే టార్గెట్‌గా విద్యార్థుల్ని మత్తుకి బానిసలు చేస్తున్నాయి. ఈ తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి.

Similar News

News December 1, 2025

POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

image

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్‌ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.

News December 1, 2025

ఈ కాల్స్/మెసేజ్‌లను నమ్మకండి: పోలీసులు

image

పార్సిల్‌లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్‌ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్‌లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్‌లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.

News December 1, 2025

తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>