News November 9, 2024

పెనుముప్పుగా మారిన డ్రగ్స్: పవన్ కళ్యాణ్

image

AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందని, ఇదే ఇప్పుడు పెనుముప్పుగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఓ కంపెనీలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 6, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా <<>>బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన NISM/NCFM సర్టిఫికెట్ ఉండి పని అనుభవం గలవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers

News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ఎవరు?
2. కంసుడి తండ్రి ఎవరు?
3. శశాంకుడు అంటే ఎవరు?
4. విశ్వకర్మ పుత్రిక ఎవరు?
5. తెలుగు సంవత్సరాలు ఎన్ని?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 6, 2025

ఏపీలోని ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి: తుమ్మల

image

TG: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెంను తిరిగి విలీనం చేయాలని కోరారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం.