News November 2, 2024
ఓఆర్ఆర్పై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
TG: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ORRపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద ఈ టెస్టులు చేస్తారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కాగా మద్యం తాగి ORRపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News November 2, 2024
ఉద్యోగి ఆత్మహత్యపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విధులకు సంబంధించి పైస్థాయి వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగి ఆత్మహత్యకు కారణంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వ్యక్తుల నిర్ణయాలు ఉద్యోగులకు కొన్నిసార్లు కష్టతరంగా అనిపించవచ్చు. అయితే హానికారక ఉద్దేశం లేకపోతే ఉద్యోగి ఆత్మహత్యకు వారిని బాధ్యులుగా పరిగణించలేం’ అని బీఆర్ అంబేడ్కర్ కాలేజీ(Delhi వర్సిటీ) EX ప్రిన్సిపల్ కేసులో పేర్కొంది.
News November 2, 2024
రేపు ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ
NZతో మూడో టెస్టులో భారత్ గెలుస్తుందా లేదా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే 143 పరుగుల ఆధిక్యంలో ఉన్న NZ, INDకు 160 పరుగుల టార్గెట్ ఇచ్చే ఛాన్సుంది. దీనిని ఛేదించడం INDకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు SA (163vsIND) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. రేపు టీమ్ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి.
News November 2, 2024
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్‌కు బదిలీ
TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.